GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 8:14 pm Posted by : GURU SWAMY

జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రేరాత్మక అవగాహన సదస్సు

కార్వేటినగరం జూలై 22 గరుడదాద్రి న్యూస్ కార్వేటి నగరంలో ఉన్న లక్ష్మీ నరసింహ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రేరణాత్మక కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని కార్వేటినగరం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీ D తేజస్విని గారు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి దశ జీవితాన్ని మలిచే అత్యంత కీలకమైన దశ అని పేర్కొన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూచించారు. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేసి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మత్తు పదార్థాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.అలాగే మహిళల భద్రత, సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసులను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. చదువుతో పాటు మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలు అలవర్చుకోవడం కూడా ఎంతో అవసరమని ఆమె తెలిపారు.
కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, ఉన్నత లక్ష్యాల వైపు నడిపించే ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కిషోర్, డైరెక్టర్లు దిలీప్ కుమార్ ధనుంజయ రెడ్డి వెంకటేష్ , పురుషోత్తం,అధ్యాపకులు మరియు ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.