ప్రేక్షకులను భయకంపితులను చేసిన కీచక వధ

మారువేషంలో కీచకున్ని చంపిన భీముడు రామచంద్రాపురం,జూలై 23: రామచంద్రపురం మండలంలోని నిలువురాళ్ల కమ్మపల్లి లో నిర్వహిస్తూ ఉన్న 60వ మహాభారత వార్షికోత్సవంలో గురువారం కీచక వధ (నర్తనశాల) హరికథ ,రాత్రి పౌరాణిక నాటకం ప్రేక్షకులను భయకంపితులను చేసింది. జూదంలో ఓడిపోయిన పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసంలో గడిపి ఒక్క సంవత్సరం అజ్ఞాతవాసం గడపటానికి ద్రౌపతి తో పాటు మారువేశాలలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా విరటుని కొలువులో ప్రవేశించారు. ద్రౌపతి విరాట రాజు భార్య సుధీష్ణ దేవి వద్ద సెరంద్రీ అనే పేరుతో చెలికత్తెగా,ధర్మరాజు కంకు బట్టారకుడుగా,భీముడు...