శ్రీసిటీలోని అకార్డ్ స్కూల్ కు కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ గుర్తింపు

- స్కూల్ యాజమాన్యాన్ని అభినందించిన మంత్రి లోకేష్ శ్రీసిటీ, జూలై 19, 2026: శ్రీసిటీలోని అకార్డ్ స్కూల్‌కు యుకె కు చెందిన ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గుర్తింపు లభించింది. దీనిని అధికారికంగా ధృవీకరిస్తూ IA770 కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ నంబర్‌ను కేటాయించారు. దీంతో అకార్డ్ స్కూల్లో ఇకపై కేంబ్రిడ్జ్ ప్రైమరీ (5–11 ఏళ్లు), కేంబ్రిడ్జ్ లోయర్ సెకండరీ (11–14 ఏళ్లు) విద్యా కార్యక్రమాలను అమలుచేయనున్నారు. ఈ గుర్తింపుతో విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన పాఠ్యాంశాలు, అంతర్జాతీయ స్థాయి కేంబ్రిడ్జ్ చెక్‌పాయింట్ అసెస్‌మెంట్లు, ఉన్నత...