ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కడా ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్. పీజీఆర్‌ఎస్‌లో 48 వినతులు స్వీకరణ. కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన పాలన అందించేందుకు ప్రతి శాఖ అధికారి బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ అన్నారు.సోమవారం కుప్పం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మట్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు....