పేదల ఇళ్ల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పచ్చజెండా: 9.2 లక్షల మంది అర్హుల గుర్తింపు
గరుడధాత్రి న్యూస్ : రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత నిరుపేదల సొంతింటి కల సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ్ (PMAY-G) పథకం కింద ఇళ్ల నిర్మాణాల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తూ అర్హుల తుది జాబితాను ఖరారు చేసింది. ఈ పథకం కింద గతంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. మొత్తం వచ్చిన 10.42 లక్షల దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత పారదర్శకంగా పరిశీలించారు. అనర్హులను తొలగించి, ప్రాథమికంగా 9.2 లక్షల...