GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:22 pm Digital Edition : GURU SWAMY

వెంగంవారిపల్లి లో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వృద్దు రాలు మృతి

ఎస్ సి కాలనీలో విద్యుత్ షాక్ కు గురై వృద్దు రాలు జయమ్మ మృతి*

పుట్టినింట్లో బంధువులతో సరదాగా గడుపుదామని వచ్చిన తావడకుప్పం జయమ్మ (70) ఇక లేరు.

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జులై19

బైరెడ్డిపల్లి మండలం వెంగంవారిపల్లి ఎస్.సి.కాలనిలో శుక్రవారం డెబ్భతిన్న విద్యుత్ స్థంభం వద్ద విద్యుత్ షాక్ కు గురయ్య ఒక వృద్ధురాలు మృతి చెందింది. గ్రామాల్లో నిరంతరం జనవాసం ఉన్న చోట నెలకొని యున్న విద్యుత్ స్థంభాల వద్ద విద్యుత్ శాఖ అప్రమత్తమై కంచె ఏర్పాటు చేస్తే బాగుoడును….???

కాని ఇలాంటివి ఆశాఖ వారు పట్టించుకోరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు వచ్చే పని అయితే గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో కూడా అదే చోట చిన్నారి కూడా దెబ్బతిన్నాడు…కానీ నేటికీ విద్యుత్ శాఖ స్పందించక పోవడం విడ్డురంగా వున్నదని గ్రామస్థులు వాపోతున్నారు.
గ్రామoలో చిన్నగా విద్యుత్ సమస్య వచ్చినా డబ్బులు ఇవ్వనిధి పని చెయ్యరని గ్రామస్థులు ఆరోపించారు.
రైతుల దగ్గర కరెంట్ ఛార్జ్ బిల్లు డబ్బులు తీసుకొని నెలలు గడుస్తున్నా డిపార్ట్మెంట్ కు కట్టరని, పెద్ద మొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నది.అంచనాలు లేకుండా డిపార్ట్మెంట్ కు తెలియకుండా సంబంధిత సిబ్బంది డబ్బులు తీసుకొని లైన్లు లాగడం, విద్యుత్ స్థం భాలు మార్చడం , దొంగ మీటర్లు పెట్టడం ఆనవాయితి గా కొనసాగుతుందని విమర్శించారు. అదే ఒక ప్రాణం పోతుంది…దీన్ని మీ ఉన్నతాధికారులకు తెలియబరచండని పదే పదే గ్రామస్థులు మొత్తుకోన్న ఉలుకు పలుకు ఉండదు. సంబంధిత గ్రేడ్ 2 జె ఎల్ ఎం కు గతంలో ఎన్నో సార్లు చెప్పిన…. కానీ పట్టించుకోడు డబ్బులు ఇస్తే పని లేకుంటే లేదని బాధితులు పేర్కొన్నారు.
డబ్బులిస్తే 33 కేవీ,11 కేవీ లైన్స్ కూడా మార్చేస్తున్నారు.ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది.అదే పేదోడు దొరికితే గుండు కొట్టేస్తున్నారు. రైతన్నలు పోన్ చేస్తే మద్యం మత్తులో సమాధానం కూడా జరుగుతోందని గ్రామస్థులు తెలిపారు. నేడు నిండు ప్రాణం పోవడంకు ఎవది బాధ్యత ,వృధురాలు జయమ్మ మధ్య. తరగతి కి చెంది పేదవారు.ఆకుటుంభంకు ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.ఆమె మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇకనైనా మండలంలో ప్రమాదకర విద్యుత్ స్తంభాలు ఉన్నాయా వాటిని గుర్తించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.