వైభవంగా అర్జునుని తపస్సు

కార్వేటి నగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం మేజర్ పంచాయతీ లో వెలసిన తిరుపతి ధర్మరాజుల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల భాగంగా శుక్రవారం ఉదయం స్వామి అమ్మవార్లకు అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నంది వాహనంపై పురవీధుల్లో శివపార్వతులు ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కర్పూర హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం ఆలయం వద్ద అర్జునుని తపస్సు వైభవంగా నిర్వహించారు. అర్జునుని వేషధారణలో విభూది పండు నిమ్మకాయలు విసిరేసి గట్టు ఘట్టాన్ని ఆకట్టుకునే విధంగ నిర్వహించారు. నిమ్మ పండ్లు...