ఘోర తపస్సుతో పాశుపతాస్త్రాన్ని పొందిన అర్జునుడు
తపస్సుతో శివపార్వతులను మెప్పించిన అర్జునుడు రామచంద్రాపురం,జూలై 22: రాబోవు కురుక్షేత్రంలో విజయం సాధించడానికి అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ పనిలో పనిగా ఘోర తపస్సుతో శివపార్వతులను మెప్పించి అత్యంత మహిమ కలిగిన పాశుపతాస్త్రాన్ని సంపాదించటమే అర్జున తపస్సు. శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలికి చెందిన భాస్కర్ అర్జున పాత్ర దారుడిగా,లక్ష్మయ్య శివుడి పాత్రధారిగా, పార్వతి గా ధనలక్ష్మి చక్కగా పాత్రలలో లీనమై కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఇంద్రకీలాద్రిపై అర్జునుడు పాశుపతాత్రాన్ని సంపాదించడానికి శివుని గురించి తపస్సు చేయటం,తపస్సుకు మెచ్చి శివుడు పార్వతిని వెంటబెట్టుకొని అర్జునుడిని పరీక్షించటానికి ఇంద్రకీలాద్రి కి...