కుప్పం నియోజకవర్గ ఏపీజేఎఫ్ అధ్యక్షుడిగా అస్గర్ ఏకగ్రీవ ఎన్నిక
. * జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా- అస్గర్. కుప్పం,జులై 23 (గరుడ ధాత్రి న్యూస్):కుప్పం నియోజకవర్గ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం (ఏపీజేఎఫ్) నూతన కార్యవర్గాన్ని గురువారం జరిగిన నియోజకవర్గ కమిటీ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని జర్నలిస్టులు పాల్గొన్నారు.అనంతరం నూతన కమిటీని వారు ప్రకటించారు. నియోజకవర్గ ఏపిజెఎఫ్ అధ్యక్షుడిగా అస్గర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా సయ్యద్ ఉమ్మర్, లక్ష్మీనారాయణ,లను ప్రధాన కార్యదర్శిగా భూపతి, కోశాధికారిగా దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాసుల రెడ్డి, కృష్ణంరాజు, శివా రాయల్, మురళిలను ఎన్నుకున్నారు....