దేశవ్యాప్తంగా 180 బ్లాకుల్లో మెరుగైన ఫలితాలు
దేశంలో భూగర్భ జలాల నిర్వహణ మరియు పరిరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ‘అటల్ భూజల్ యోజన’ (Atal Bhujal Yojana
ABY)సత్ఫలితాలనిస్తూ ఘన విషయం సాధిస్తోందని తానడిగిన ప్రశ్నకు భారత ప్రభుత్వం సమాధానం ఇచ్చినట్లు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేసారు.
ఈ పథకం ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు గణనీయంగా పెరిగినట్లు ఎన్డిఏ సర్కార్ వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హారైన చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు..గురువారం లోక్ సభలో “అటల్ భుజల్ యోజన కింద ఎంపికైన బ్లాకులకు” సంబంధించిన వివరాలను తెలియజేయాలని కోరగా..,స్పందించిన
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి **రాజ్ భూషణ్ చౌదరి** లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించినట్లు చిత్తూరు ఎంపి దగ్గుమళ్ళ ప్రసాదరావు తెలియజేసారు.
ఈ పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో కూడిన భూగర్భ జల నిర్వహణ కార్యక్రమంగా ఏడు రాష్ట్రాల్లోని (గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్) 80 జిల్లాల పరిధిలోని 229 బ్లాకుల్లోని 8,203 నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న గ్రామ పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా 01.04.2020 నుంచి 15.10.2025 వరకు అమలు చేశారు.
ఈ పథకం అమలు జరిగిన తీరు పై క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) ఆధ్వర్యంలో సమగ్ర ప్రభావ అంచనా అధ్యయనం (Impact Assessment Study) నిర్వహించారు. దీని ప్రకారం, పథకం పరిధిలోని మొత్తం 229 బ్లాకుల్లో **180 బ్లాకుల్లో** భూగర్భ జల మట్టాలు మెరుగైనట్లు తేలింది.ఈ పథకం కింద రాష్ట్రాల పనితీరు ఆధారంగా నిధులు కేటాయించడం జరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం *రూ. 4,000.80 కోట్లు** విడుదల చేయగా, అందులో **రూ. 3,922.21 కోట్లు** సద్వినియోగం అయ్యాయి. భూగర్భ జలాల నిర్వహణలో మహిళలు పెద్దఎత్తున భాగస్వామ్యులై, నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారని నివేదిక పేర్కొంది.
సామర్థ్య పెంపుదల (Capacity Building) మరియు ఐఈసీ (IEC) కార్యకలాపాల ద్వారా స్థానిక ప్రజల్లో భూగర్భ జలాల పరిరక్షణపై తీవ్రమైన అవగాహన వచ్చిందని వెల్లడైంది.
నిర్ణీత కాలపరిమితితో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ సఫలం కావడంతో, కమ్యూనిటీ ఆధారిత భూగర్భ జల నిర్వహణకు ఇదొక చక్కటి నమూనాగా నిలిచిందని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద రావు వివరించారు.