డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సు – లార్వా సర్వే

పలమనేరు, జులై 24 ( గరుడ ధాత్రి ) : డెంగ్యూ నివారణ మాసోత్సవం మరియు 'ఫ్రైడే - డ్రై డే' కార్యక్రమంలో భాగంగా పలమనేరు సబ్ యూనిట్ ఆఫీసర్ జయశంకర్ ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్‌లో విస్తృతంగా లార్వా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పరిసరాలను పరిశీలించి, స్థానిక ప్రజలకు డెంగ్యూ వ్యాధి లక్షణాలు మరియు నివారణ మార్గాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. డెంగ్యూ వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇంటి లోపల మరియు వెలుపల వారం రోజులకు పైగా ఉన్న పాత...