స్వచ్ఛ రథంపై మహిళలకు అవగాహన

రామచంద్రాపురం: రామచంద్రాపురం మండలంలోని పలు గ్రామాలలో ఎంపీడీవో పులిరాం సింగ్ స్వచ్ఛరథంపై మహిళలకు అవగాహన కల్పించారు. మీ ఇంటిలోని పాత వస్తువులను స్వచ్ఛ రథం కు ఇవ్వాలన్నారు. మీరు ఇచ్చే వస్తువులకు సరిపడే నిత్యవసర వస్తువులు, పిల్లలకు ఉపయోగపడే వస్తువులను అందిస్తామన్నారు. అలాగే స్వచ్ఛ రథంలో మీకు ఏ వస్తువులు అవసరమో వాటి పేర్లు తెలిపితే ఆ వస్తువులను స్వచ్ఛ రథంలో ఉంచుతామన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.