అనిమిగానిపల్లెలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠకు భూమిపూజ

కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్): కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అనిమిగానిపల్లెలో సంవత్సరాలుగా నిలిచిపోయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన వివాదానికి ముగింపు పలుకుతూ సోమవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల పెద్దలు, ప్రజలతో సామరస్యపూర్వకంగా చర్చించి, అందరి సహకారంతో విగ్రహ ప్రతిష్ఠకు మార్గం సుగమం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి కడ అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ రాజ్‌కుమార్,దళిత యువజన సేవా సమితి అధ్యక్షుడు కె. కన్నన్, ప్రభుత్వ వైద్యశాల వైస్ చైర్మన్ భారతి త్రిలోక్,ఆర్ముగం...