పగిలిన తాగునీటి పైప్‌లైన్… దుమ్ము, ధూళి కలిసిన నీరే ప్రజలకు సరఫరా
పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి తీరుపై టి.పి.కోట గ్రామ ప్రజల ఆగ్రహం. నాగలాపురం, గరుడ దాత్రి జూలై 20: నాగలాపురం మండల పరిధిలోని టి.పి. కోట గ్రామ పంచాయతీలో తాగునీటి సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ఆర్ అండ్ బి ప్రధాన రహదారిపై ఉన్న తాగునీటి పైప్‌లైన్ పగిలి ఉండటంతో, పైప్‌లోకి దుమ్ము, ధూళి, మురుగు చేరుతున్నప్పటికీ అదే నీటిని గ్రామంలోని ఓవర్‌హెడ్ ట్యాంకుకు పంపించి ప్రజలకు సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకల కారణంగా ఎగిసిపడుతున్న దుమ్ము, మట్టి...