భూ పరిపాలన అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీసీఎల్‌ఏ సమీక్ష

తిరుపతి, జూలై 21 గరుడధాత్రి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి భూ పరిపాలన, రెవెన్యూ శాఖకు సంబంధించిన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (CCLA) మరియు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి. జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 22-ఏ భూములు, వెబ్‌ల్యాండ్, పట్టాదారు పాస్‌బుక్‌ల పంపిణీ, రీ-సర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, ఫారెస్ట్ ల్యాండ్స్,...