GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 7:03 pm Digital Edition : GURU SWAMY

బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధం

పలమనేరు జూలై 20 (గరుడ ధాత్రి ) :
బాల్య వివాహాలు చేయడం చట్ట విరుద్ధమని పలమనేర్ ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్,సిడిపిఓ ఉమారాణి పేర్కొన్నారు. అందులో భాగంగా గంగవరం మండలం దండపల్లి హై స్కూల్ ఆవరణలో హై స్కూల్ హెచ్ఎం జ్యోతి ప్రసాద్ సహకారంతో సోమవారం అంగన్వాడి వర్కర్ లక్ష్మి అధ్యక్షతన బాల్య వివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐసిడిఎస్ సూపర్వైజర్ పుష్ప, సునీత, డాక్టర్ మల్లికార్జున రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారిని ఆదేశాల మేరకు సమాజంలో బాల్య వివాహాలు చేసుకోవడం వలన బాలికలకు గర్భాధారణ సమస్య రోజుకు రోజుకు పెరుగుతున్నదని దాని వలన బాలిక చిన్న వయసులోనే అనారోగ్యనికి గురై క్షీణించి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి నివారణ చర్యల్లో భాగంగా ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించింది అని తెలిపారు. అభం శుభం తెలియని చిన్నారులపై రోజురోజుకు లైంగిక వేధింపులు అధికమవుతున్నాయని వాటిని అరి కట్టాలంటే ప్రధానంగా ప్రజలు చైతన్యం కావాల్సి ఉందన్నారు. అదేవిధంగా విద్యార్థుల్లో పెరుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించడం, ఆత్మహత్యలు నివారణ చర్యలపై హాజరైన వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు. జీవిత ప్రయాణంలో కష్టాలు, అపజయాలను అధిగమించాలంటే ప్రతి మనిషికి ధైర్యం, ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. అదే విధంగా పిల్లలు చిన్నతనము నుండే మాదకద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచి భవిష్యత్తు ఉంటుందని పిలుపునిచ్చారు. విలాసాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలని, బాలికలపై జరుగుతున్న అఘాయిత్యాలకు పోక్సో చట్టాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్నదని దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ క్రమంలో , ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, కిశోర బాలబాలికలు తల్లులు పాల్గొన్నారు.