GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 25 July 2026, 6:48 am Digital Edition : GURU SWAMY

పిల్లల చదువు తల్లిదండ్రుల బాధ్యత

– విద్యారంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

– సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదమూలం

నారాయణవనం జూలై 24 (గరుడదాత్రి న్యూస్) పిల్లలను బాగా చదివించి వారికి బంగారు భవిష్యత్తు అందించడం తల్లిదండ్రుల బాధ్యతని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. మండల కేంద్రమైన నారాయణవనంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం 4 0 మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిమూలం మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పుకు పునాది వేసారని విద్యారంగంలో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని తెలిపారు. జీవితంలో ఏదైనా కోల్పోవచ్చు గాని విద్యను మాత్రం కోల్పోకూడదని అన్నారు చదువుతోనే మంచి భవిష్యత్తు సాధ్యమవుతని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా ఒక ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరి పిల్లలకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఒక విద్యార్థికి 13 వేల రూపాయల జమ చేయడం కూటమి ప్రభుత్వం సంక్షేమానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ, ఎంఈఓ లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.