పింఛన్ పేరుతో రూ.1,440 వసూలు.. నకిలీ రశీదుతో డిజిటల్ అసిస్టెంట్ మోసం.. సత్యవేడులో కలకలం

సత్యవేడు, జూలై 22 గరుడధాత్రి : పింఛన్ దరఖాస్తు పేరుతో సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ ఓ బాధితుడి నుంచి రూ.1,440 వసూలు చేసి, నకిలీ రశీదు ఇచ్చిన ఘటన సత్యవేడు సచివాలయం-4 పరిధిలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదుతో అధికారులు విచారణ ప్రారంభించారు. బాధితుడి వివరాల ప్రకారం.. సత్యవేడు పట్టణంలోని కోమటిగుంటకు చెందిన ఓ వ్యక్తికి ఏడాది క్రితం పక్షవాతం రావడంతో ఇటీవల కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం సచివాలయం-4కు చెందిన డిజిటల్ అసిస్టెంట్ అశోక్ ఫోన్ చేసి,...