GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 6:45 am Digital Edition : GURU SWAMY

బైరెడ్డిపల్లి లో కొద్దిపాటి వర్షంకు రహదారిపై నిల్వ ఉన్ననీటితో ఇబ్భంధుల్లో భాటసారులు.వాహన చోదకులు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి ఆగస్టు8

మండల కేంద్రం అయిన బైరెడ్డిపల్లి లో చిన్నపాటి వర్షం శనివారం సాయంత్రం కురిసింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట నీరు నిలచి బాటసారులకు,వహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పూర్వ కాలం నుండి ఉన్న కాలువలు పుదీనా,ఆక్రమణలకు గురికావడంతో మురికినీరు రహదారి పైకి చేరుకొనే దుస్థితి ఏర్పడింది. ఈ రహదారి లో ప్రస్తుతం ట్రాఫిక్ బెంగళూర్ పట్టణ ట్రాఫిక్ గా నెలకొన్నది.ఈ రహదారిపై గ్రామస్థులు పోవాలన్న భయపడుతూ పోయి పనులు చేసుకొంటున్నారు.ఒకవైపు ఇరుకు అయిన రోడ్డు,మరోవైపై రహదారిపై వర్షపు నీరు నిల్వ భాటసారులు.వాహన చోదకులు పద్మమూహం చేధించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇకనైనా అధికారులు స్పందించి రహదారి వెడల్పు ,రహదారిపై నీరు నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.