అనపగుంటలో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేత దెయ్యాల కిరణ్ పర్యటన
తడ ఆగస్టు 09 గరుడధాత్రి : తడ మండలం అనపగుంట గ్రామంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ దెయ్యాల కిరణ్ హామీ ఇచ్చారు. అనపగుంట గ్రామంలో పర్యటించిన దెయ్యాల కిరణ్ స్థానిక ప్రజలతో కలిసి గ్రామంలోని ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కొరత, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు తదితర అంశాలపై ప్రజలతో చర్చించి, వారి అభిప్రాయాలను...