భూమన కుటుంబ ఆస్తుల విధ్వంసం కక్షసాధింపు చర్యే : ఎంపీ మద్దిల గురుమూర్తి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి కుటుంబానికి చెందిన భూములను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుని చేపట్టిన చర్యలను తిరుపతి లోక్‌సభ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. భూమన కరుణాకర రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే ఆయన కుటుంబ ఆస్తులను లక్ష్యంగా చేసుకోవడం దురదృష్టకరమని అన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు అధికార పార్టీ రాజకీయ...