GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:28 pm Digital Edition : GURU SWAMY

శ్రీ శక్తి పీఠానికి పోటెత్తిన భక్తులు

రామచంద్రపురం: రామచంద్రాపురం మండలంలోని శ్రీ శక్తి పీఠం లో జరుగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహీ మహాక్షేత్రమైన తిరుపతి శ్రీ శక్తిపీఠంలో నిర్వహించబడుతున్న శ్రీ వారాహీ నవరాత్రి మహోత్సవములలో ఎనిమిదవ రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ప్రయోగబాధలు మరియు దుష్ట గ్రహ పీడా నిర్మూలన సమస్యా పరిష్కారం కొరకు విశేష ఫలదాయకమైన శ్రీ కిరాత వారాహీ దేవి* ప్రత్యేక మంత్ర హోమం నిర్వహించబడినది.
స్త్రీమూర్తులకు సువాసిని పూజా,
మధ్యాహ్నం అమ్మవారికి మహా హారతి సమర్పించబడగా, సాయంత్రం కళా నివేదన రూపంలో సంగీత, నాట్య, సాహిత్య సేవలు అమ్మవారికి అంకితం చేయబడినవి. రాత్రి వేళ పరమపూజ్య శ్రీ మాతాజీ వారి సమక్షంలో నవరాత్రి పూజ, దర్బారు సేవ జరుగగా, నడిచే దైవం జగద్గురువుల వారిచే మహా హారతి, అనంతరం అమ్మవారికి ఏకాంత సేవ నిర్వహించబడినవి.
ఈ పుణ్యదినాన సుమారు 20,000 మందికి పైగా భక్తులు క్షేత్రాన్ని సందర్శించి అమ్మవారి దివ్య దర్శన భాగ్యాన్ని పొందారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ సమృద్ధిగా జరిగినది, ఇది గురు-దైవానుగ్రహానికి, పీఠం సేవాతత్పరతకు నిదర్శనంగా నిలిచింది.