శ్రీ శక్తి పీఠానికి పోటెత్తిన భక్తులు
రామచంద్రపురం: రామచంద్రాపురం మండలంలోని శ్రీ శక్తి పీఠం లో జరుగుతున్న వారాహి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచంలోని అత్యంత మహిమాన్వితమైన ఏకైక శ్రీ పాతాళ శ్వేత వారాహీ మహాక్షేత్రమైన తిరుపతి శ్రీ శక్తిపీఠంలో నిర్వహించబడుతున్న శ్రీ వారాహీ నవరాత్రి మహోత్సవములలో ఎనిమిదవ రోజున అమ్మవారికి పంచామృతాభిషేకం, విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ప్రయోగబాధలు మరియు దుష్ట గ్రహ పీడా నిర్మూలన సమస్యా పరిష్కారం కొరకు విశేష ఫలదాయకమైన శ్రీ కిరాత వారాహీ దేవి* ప్రత్యేక మంత్ర హోమం నిర్వహించబడినది....