GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 7:14 pm Posted by : GURU SWAMY

శేష వాహనంపై ఊరేగిన ద్రౌపతి సమేత ధర్మరాజు

కార్వేటి నగరం జూలై 22 గరుడ దాద్రి న్యూస్
కార్వేటినగరం లో వెలసిన ద్రౌపతి సమేత ధర్మరాజు ల స్వామి ఆలయంలో మహాభారత ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం ఆలయంలో అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయం వద్ద శ్రీమతి సుమతి ఆధ్వర్యంలో మానస సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి పుష్కరిణి నుండి తీర్థం తీసుకుని స్వామి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. రాత్రి స్వామి అమ్మవార్లు చిన్న శేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు కర్పూర హారతి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు.. రాత్రి వెంకటేశ్వర నాట్య కళామండలి ఆధ్వర్యంలోనాటకం నిర్వహించారు. ఉభయ దాతలుగా క్షత్రియ కులస్తులు, శ్రీకాంత్ వర్మ, ఆదిత్య వర్మ, సుబ్రహ్మణ్యం రాజు, ధనంజయవర్మ ,నాగరాజు, వినయ్, మురళీకృష్ణ వర్మ, త్యాగరాజు, మంజునాథ్ వర్మ, నటరాజు మాధవ రాజు ఆలయం చుట్టూ మరియు గ్రామం చుట్టూ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు రవి యాదవ్, ఉపాధ్యక్షులు రవి రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్ రాజు, కోశాధికారి లక్ష్మీపతి మొదలియార్, సహాయ కార్యదర్శి సాయి రాయల్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.