GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 08 August 2026, 5:05 pm Digital Edition : GURU SWAMY

మహాలక్ష్మి దీప పూజను దిగ్విజయం చేయండి

మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి

పలమనేరు, ఆగస్టు 08 ( గరుడ ధాత్రి ) :
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమం ఆగస్ట్ 14వ తేది శుక్రవారం సాయంత్రం 4 గంటలకు పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అత్యంత భక్తి శ్రృధ్ధలతో ఘనంగా నిర్వహించనున్నామని ఈ కార్యక్రమాన్ని పలమనేరు వాసులు దిగ్విజయం చేయాలని శాసన సభ్యులు అమరనాథ రెడ్డి కోరారు. పలమనేరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం స్థానిక నేతలతో కలసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఈ పవిత్రమైన దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
హిందూ ధర్మంలో దీపానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉందని, దీప ప్రజ్వలన ద్వారా అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానజ్యోతి వెలుగుతుందన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా కుటుంబాల్లో శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యం నెలకొంటాయని విశ్వాసం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు, మన సంస్కృతి, సంప్రదాయాలు, సనాతన ధర్మపరిరక్షణము మరింత ప్రేరణ కలిగిస్తుందన్నారు. ఈ సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ మహలక్ష్మి అమ్మవారి దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి హజరయ్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మీడియా సమావేశంలో నాయకులు ఆర్వీ బాలాజీ, సత్యప్రకాష్, బ్రహ్మయ్య, మురళీ కృష్ణ, గిరిబాబు,నాగరాజు, సురేష్, కోటేశ్వర్లు, శ్రీధర్,మదన్, బిఆర్సీ కుమార్, సుబ్బు,శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.