GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 7:20 am Posted by : GURU SWAMY

విద్యార్థిని అదృశ్యం

కార్వేటినగరం జూలై 27 గరుడదాద్రి న్యూస్ కార్వేటినగరం పంచాయతీ వడ్డీ ఇండ్లు నివాసముంటున్న బ్రతుకుతెరువు కోసం రొంపిచర్ల మండలం గానుగ చింత గ్రామంలో మేస్త్రి పని చేస్తున్నాడు కుమార్తె నివేద 16 సంవత్సరాలు రెండు నెలలు శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతుంది. కార్వేటి నగరంలో జరుగుతున్న ద్రౌపతమ్మ తిరుణాల కోసం కార్వేటినగరం కి తీసుకుని వచ్చారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 9 గంటల 30 మధ్యలో నా కుమార్తె కనపడలేదని బంధువుల ఇండ్లకి ఫోన్ చేసి అడగ ఎవరు రాలేదన్నారు. సదరు గ్రామానికి చెందిన అక్క కుమారుడు బోగేష్ అని వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడని కార్వేటినగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు బోగేష్ తో పాటు అతను చెల్లి శోభ శోభ భర్త వెంకటేష్ పై అనుమాన ఉందని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తేజస్విని తెలిపారు.