కార్వేటినగరం జూలై 24 గరుడదాద్రి న్యూస్
కార్వేటి నగరంలో ఉన్న జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉన్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలకు పూర్వ విద్యార్థి స్వర్ణ రమేష్ వారి ఆధ్వర్యంలో 24 వేల రూపాయలు విలువచేసే దుస్తులను గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో శాసనసభ్యులు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే సమయంలో ఇంటర్ విద్యార్థిలకు యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేసేందుకు అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. అనంతరం దాతను ఘనంగా సన్మానించారు. గత మూడు సంవత్సరాలుగా ఇంటర్ విద్యార్థినిలకు యూనిఫామ్ దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మర్రి శేఖర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.