GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 10:33 pm Posted by : GURU SWAMY

ఐటి హబ్ విస్తరణ దిశగా జిల్లా అడుగులు .

.

ఐటి మౌలిక సదుపాయాల కొరకు డిజిటల్ పోర్టల్ ఏర్పాటు . .

*:జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్*

*తిరుపతి, గరుడ దాత్రి న్యూస్ జూలై 23:* ఐటి హబ్ విస్తరణ దిశగా జిల్లా అడుగులు వేస్తోందని, ఐటి మౌలిక సదుపాయాల అన్వేషణ కొరకు ఐటి పెట్టుబడిదారులు, భూ యాజమానుల మధ్య సమన్వయం చేస్తూ ఏపి ఐటి ఇన్ఫ్రా కనెక్ట్ ద్వారా డిజిటల్ పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న కమర్షియల్ భవనాలు, ఖాళీ భూములు, కార్యాలయ స్థలాల యజమానులు ఆస్తుల వివరాలను itinfra.ap.gov.in ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు. పెట్టుబడిదారులు ఈ పోర్టల్ ద్వారా సమగ్ర మ్యాప్ ఉపయోగించి ఆస్తుల భౌగోళిక స్థానాల గుర్తింపు, స్థల ఎంపిక, మౌలిక సదుపాయాల అన్వేషణ సులభంగా చూసుకోవచ్చన్నారు. భూ వివరాలను నమోదు చేయడం ద్వారా భవనాలు, ఖాళీ స్థలాలు లీజుకు లేదా అద్దెకు ఇవ్వడం ద్వారా భూ యజమానులకు కూడా ఆదాయం సమకూరుతుందన్నారు. తద్వారా జిల్లాలో సులభంగా పరిశ్రమల స్థాపన జరగడం తో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ నేపథ్యంలో ఖాళీ భూములు, కార్యాలయ భవనాలు ఉన్న వారి ఆస్తుల వివరాలను ఉచితంగా నమోదు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు. మరిన్ని వివరాల కొరకు జిల్లా ఐటీ మేనేజర్ రమేష్ ఫోన్ నంబర్ 9353494415 ను సంప్రదించవచ్చన్నారు.