117 రోజుల సుదీర్ఘ పోరాటానికి చారిత్రాత్మక విజయం…
పి ఆర్ సి మంజూరు కు జీవో విడుదల ….
ఆనందోత్సవాలలో కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు….
టిడిపి నేత కోడూరు బాలసుబ్రమణ్యం ను సత్కరించిన ఉద్యోగులు
తిరుపతి, జులై 20 :
తిరుపతి కో-ఆపరేటివ్ ఉద్యోగులకు పి ఆర్ సి విడుదల కోసం 117 రోజులు ఉద్యోగులంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బ్యాంకు ఉద్యోగులకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడురు బాలసుబ్రమణ్యం పి.ఆర్.సి ఇప్పించి తీరుతానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఉద్యోగులకు పిఆర్సి ఇప్పించడానికి రాష్ట్రస్థాయిలోని సహకార శాఖ కమిషనర్ తో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులను కలసి 16 సంవత్సరాలుగా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పిఆర్సి సమస్యను డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం పలుమార్లు విన్నవించారు. అంతకుమునుపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వ్యవసాయ శాఖ, సహకార శాఖ మంత్రి అచ్చం నాయుడుల ప్రత్యేక చొరవ చూపడంతో ఉద్యోగులందరికీ 2015 పి ఆర్ సి తో కూడిన జీతాలు మంజూరు చేయడంతో పాటు బకాయిలను ఇచ్చేందుకు సోమవారం జీవో విడుదల చేశారు.
ఉద్యోగుల 117 రోజుల దీక్షలకు ఫలితం….
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు 100 మంది దాకా 2015 పిఆర్సి మంజూరు కాకపోవడంతో చాలీచాలని జీతాలతోనే కుటుంబాలను పోషించుకుంటూ కాలం గడుపుతున్నారు. పి అర్ సి తో కూడిన జీతాలు ఇవ్వమని పలుమార్లు ప్రస్తుత చైర్మన్, పాలకవర్గ సభ్యులను అభ్యర్థించిన పట్టించుకోలేదు. దీంతో ఉద్యోగులందరూ సమ్మెబాట పట్టారు. నిరసన కార్యక్రమాలు, ధర్నాలు వినూత్న రీతులలో చేశారు. కూటమి నాయకులను కలసి తమ ఆవేదనను విన్నవించుకున్నారు. మరి కొంతమంది నేతలు ధర్నా చేస్తున్న వారిని కలిసి సంఘీభావం తెలిపారు. ఈ నేపథ్యంలో వారి సమస్యను తన సమస్యగా మీద వేసుకొని డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం ప్రత్యేకంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి అచ్చం నాయుడు, మంత్రి నారా లోకేష్, సీఎం ఓ కార్యాలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా ప్రత్యేక చొరవ చూపారు. ఉద్యోగుల నిరసన దీక్ష ఏడవ రోజున డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం వారిని కలసి సంఘీభావం తెలిపి ఉద్యోగులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని, మీకు అండగా ఉంటానని.. రాష్ట్ర ప్రభుత్వం నుండి జీవో ఇప్పించి తీరుతానని వారందరికీ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే వెంకటేశ్వర స్వామి సాక్షిగా డాక్టర్ కోడూరు బాల సుబ్రహ్మణ్యం మాట నిలబెట్టుకుని వారందరికీ ఈ నెలలో కొత్త పిఆర్సి తో కూడిన జీతాలు మంజూరు చేసేలా జీవో విడుదల చేయించారు.
డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కు కృతజ్ఞతలు తెలిపిన
ఉద్యోగులు…
తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల జీవితాలలో వెలుగులు నింపేలా కృషిచేసిన డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కు ఉద్యోగులు అందరూ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అయినను శాలువాతో ఘనంగా సత్కరించి కన్నీటి పర్యవంతం అయ్యారు. జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఉద్యోగులందరూ చేతులెత్తి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం కు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా….
తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ 24 గంటల పాటు అందుబాటులో ఉంటానని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో తాను ఎప్పుడూ ముందు ఉంటానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం తెలిపారు. ఉద్యోగుల శాంతియుత నిరసనకు 117 రోజుల తర్వాత న్యాయం జరగడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.