ప్రేక్షకులకు కంట నీరు తెప్పించిన ద్రౌపతి వస్త్రాపహరణం
కురు పాండవుల మధ్య మరింత అసూయ రగిల్చిన రాజసూయ యాగం యుగాంతంకి నాంది పలికిన స్త్రీ నవ్వు రామచంద్రాపురం,జూలై 21: రామచంద్రాపురం మండలంలోని నిలువు రాళ్ల కమ్మపల్లిలో వెలసి ఉన్న శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల ఆలయంలో నిర్వహిస్తూవున్న 60వ మహాభారత వార్షికోత్సవాలలో మంగళవారం హరికథ భాగవతారిణి స్వర్ణలత ఆలాపించిన ద్రౌపతి వస్త్రాపహరణ కథా గానం, రాత్రి శ్రీ వెంకటేశ్వర కళానాట్యమండలి వారు ప్రదర్శించిన ద్రౌపతి మానసంరక్షణ పౌరాణిక నాటకం ప్రేక్షకులకు కంటతడి పెట్టించింది. ఖాండవ వనంలో మృత్యువు నుంచి కాపాడబడ్డ మయుడు కృతజ్ఞతగా...