అనేపూడి, చందనమూడి గ్రామాల్లో ఈ-కేవైసీ తనిఖీ – తహసీల్దార్ రాజేంద్ర

సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందేందుకే ఈ-కేవైసీ.. క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం! దొరవారిసత్రం, జూలై 21 (గరుడదాత్రి న్యూస్) మండల పరిధిలోని అనేపూడి మరియు చందనమూడి గ్రామాల్లో మంగళవారం నిర్వహించిన పర్సనల్ డేటా ఈ-కేవైసీ నమోదు మరియు పరిశీలన ప్రక్రియను దొరవారిసత్రం తహసీల్దార్ రాజేంద్ర క్షేత్రస్థాయిలో నేరుగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులతో కలిసి లబ్ధిదారుల రికార్డులను తహసీల్దార్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా, అర్హులైన...