GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 8:11 pm Posted by : GURU SWAMY

విద్యాభివృద్దే కూటమి ప్రభుత్వం లక్ష్యం

– ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే భవిష్యత్తు తరాలకు ఆర్థిక ప్రగతి
– సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం

నారాయణవనం జూలై 24 (గరుడదాత్రి న్యూస్) :
తిరుపతి జిల్లా నారాయణవనం మండలంలోని బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ తల్లికి వందనం పథకం తో భవిష్యత్తు తరాలకు ఆర్థిక ప్రగతి, రాష్ట్రాన్ని అభివృద్ధిని దూరదృష్టి తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళుతున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి జన్మాంతరం రుణపడి ఉంటానని, ఆయన అడుగుజాడల్లో ఎల్లప్పుడూ నా ఈ జీవితాన్ని ప్రజా సంక్షేమానికి ప్రజాసేవకు అందటం చేస్తానని తెలిపారు. నా 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో సర్పంచ్ నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు, గ్రామస్థాయి నుండి నియోజవర్గ స్థాయి వరకు ప్రజలకు సేవ చేసుకుంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తానని, ప్రజాసమస్యలు పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ ఊపిరి ఉన్నంతవరకు ప్రజాసేవకు అంకితం అవుతానని అన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ కి రుణపడి ఉంటాను అని టిడిపి పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికలలో అందరినీ కలుపుకొని గెలుపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు.
ఏడు పదుల దాటిన ఎక్కడ అలసట అసహనం కనబడని ఆదమూలం అన్న ఇంకా చురుకుగా ఇటు ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటూ అటు పార్టీ బలోపేతానికి నిరంతరం నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తూ సుడిగాలి పర్యటనలు చేస్తూ చేసింది చాలులే అని సేద చేరకుండా చేయాల్సింది ఇంకా చాలా ఉందని అంటూ అలుపెరుగని ప్రజా సేవకుని సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం అన్నలు చూస్తున్నామని టిడిపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అనుచరులు అభిమానులు అందరూ అభినందించి సంతోషం వ్యక్తం చేయడం కోసం మెరుపు