ఉద్యాన పంటల రక్షణకు ‘ఫార్మ్ పాండ్’, ‘వీడ్ మాట్’ సబ్సిడీలు
*మైదుకూరు ఉద్యానశాఖ అధికారి సి. రామకృష్ణ వెల్లడి గరుడ దాత్రి న్యూస్ మైదుకూరు, జులై:25 మండల వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న దృష్ట్యా, తోటలను కాపాడుకునేందుకు ఉద్యాన శాఖ ద్వారా ఫార్మ్ పాండ్‌లు (వ్యవసాయ కుంటలు), వీడ్ మాట్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం భారీగా రాయితీలు అందిస్తోందని మైదుకూరు ఉద్యానశాఖ అధికారి సి. రామకృష్ణ తెలిపారు. శనివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడారు. రాయితీల వివరాలు: వ్యక్తిగత ఫార్మ్ పాండ్‌లు: 20×20×3 మీటర్ల కొలతలతో నిర్మించుకునే కుంటలకు రూ. 1,80,000...