GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 July 2026, 5:24 pm Digital Edition : GURU SWAMY

శివాలయంలో అన్నదాన కార్యక్రమం

కార్వేటి నగరం జూలై 19 గరుడ దాత్రి న్యూస్
కార్వేటి నగరం చెరువు కట్టకు ఆనుకొని సుద్దగుంట గ్రామం సమీపమున వెలసియున్న శిష్ట సౌందర్యవల్లి సమేత సదాశివేశ్వర స్వామి సన్నిధిలో ఆదివారం ఉదయం అభిషేక ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద బజారు వీధి నివాసస్తులు కీర్తిశేషులు శ్రీ. రాజ సిద్దిరాజు సదాశివ రాజు గారి కుమారుడు కోడలు, శ్రీమతి శ్రీ. రాజ సిద్దిరాజు రఘురామ కృష్ణమ రాజు, జ్యోతి గార్ల ద్వితీయ కుమారుడు “ధనుష్ సాయి
జన్మదినం సందర్భంగా జేష్ఠ కుమారుడు విశాల్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో జరిపింపబడినది. అన్న ప్రసాదం కార్యక్రమంలో ఆలయ కమిటీ కార్యదర్శి రాజేంద్ర రెడ్డి, సుబ్బరాయల్ యాదవ్, జయ రెడ్డి,పండబ్బ, పూజారులు ప్రహల్లాద స్వామి, రవిచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.