నారాయణవనంలో గోవిందమాల భక్తులకు అన్నప్రసాదాలు
నారాయణవనం జూలై 20 (గరుడధాత్రి న్యూస్) తిరుమలకు పాదయాత్రగా వెలుతున్న గోవిందమాల భక్తులకు సోమవారం రేషన్ డీలర్ కందస్వామి మొదలియార్, డిప్యూటీ ఎంపీడీవో రవికుమార్, ఆధ్వర్యంలో అన్నప్రసాదాలను ఏర్పాటు చేశారు. తమిళ ఆడినెల ప్రారంభం నుండి వెంకటేశ్వరస్వామికి ప్రీతిపరమైన పెరటాసి నెల వరకు చెన్నై నుండి అధిక సంఖ్యలో భక్తులు గోవిందమాలను ధరించి నారాయణవనం మీదుగా తిరుమలకు నడుచుకుని వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. సోమవారం తిరుమలకు పాదయాత్రతో వెళుతున్న చెన్నైకి చెందిన సుమారు 150 మంది గోవింద మాలను ధరించిన భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాదాలను...