స్టాంప్ రైటర్ల రిలే దీక్షలకు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంఘీభావం

మైదుకూరు, జూలై 22 గరుడధాత్రి : మైదుకూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద స్టాంప్ రైటర్లు చేపట్టిన సామూహిక రిలే నిరాహార దీక్షలకు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి గురువారం జూలై 23 న సంఘీభావం ప్రకటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొని స్టాంప్ రైటర్లకు పూర్తి మద్దతు తెలియజేయనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామీణ అనుబంధ విభాగాల నాయకులు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరై దీక్షను...