నాగలాపురంలోని శ్రీ ధర్మరాజుల ఆలయంలో ఆడి నెల మొదటి ఆదివారం సందర్భంగా మాజీ సర్పంచ్ చిన్నదురై సుధా ఆదివారం ఉదయం ద్రౌపతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మండల ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ప్రార్థించారు. అనంతరం ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆయనతోపాటు ప్రముఖ వ్యాపారవేత రాజమాణిక్యం, ఆలయ నిర్వాహకులు వినోద్ ఉన్నారు.