GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 6:04 pm Posted by : GURU SWAMY

రేపు పలమనేరులో ఉచిత నేత్ర వైద్య శిభిరం

పలమనేరు, జులై 24 (గరుడ ధాత్రి) :
స్థానిక మదనపల్లి రోడ్డులోని లయన్స్ సర్వీస్ కేంద్రంలో రేపు (ఆదివారం) ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ప్రముఖ వైద్యుడు డాక్టర్ జి.వి. హేమగిరి తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పలమనేరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు కుప్పం పి.ఈ.ఎస్ వైద్య కళాశాల సంయుక్త నిర్వహణలో, డాక్టర్ జి.వి. హేమగిరి సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ హేమగిరి మాట్లాడుతూ… ప్రజలు ఉచిత కంటి చూపు పరీక్షలు చేయించుకుని, తమ నేత్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. శిబిరంలో పాల్గొనే వారికి కంటి పరీక్షలు, స్క్రీనింగ్ నిర్వహించడమే కాకుండా, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను కూడా పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సదవకాశాన్ని పలమనేరు మరియు పరిసర ప్రాంత ప్రజలు, అవసరమున్న వారు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.