GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 8:18 pm Posted by : GURU SWAMY

మాజీ సైనికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించండి…

ఈవో ను కలసి విన్నవించిన మాజీ సైనికులు
తిరుపతి, జులై 20 :
దేశ రక్షణ కోసం దశాబ్దాలుగా సేవలందించి పదవి విరమణ పొందిన మాజీ సైనికులకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించాలని మాజీ సైనికుల సంక్షేమ సంఘం నేతలు విన్నవించారు. సోమవారం టీటీడీ పరిపాలన భవనంలో ఈవో రవిచంద్రను మాజీ సైనికుల సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు మనోహర్ రెడ్డి నాయకత్వంలో అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి సూ రెడ్డి శివకుమార్, ఎమ్మార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాఖమూరి గోపాల్, ఆనంద రెడ్డి లు కలసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సాంబశివరావు, శివకుమార్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అది సైనికుల కుటుంబాలకు శ్రీవారి ప్రత్యేక దర్శనంతోపాటు వసతి సదుపాయాలు కల్పించాలని కోరామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాజీ సైనికుల చిరకాల వాంఛలను గతంలో దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలసి విన్నవించడం జరిగిందని ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో ను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. టిటిడిలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ పోస్టులు 150 లను మాజీ సైనికులతో భర్తీ చేయాలన్నారు. ఇటీవల కాలంలో కొంతమంది దురుద్దేశపూర్వకంగా మాజీ సైనికులను తగ్గించాలని లేవనెత్తిన పుకార్లకు స్వస్తిపలికి మాజీ సైనికులను అదే స్థాయిలో కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న టిటిడి ఈవో, చైర్మన్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తిరుపతి మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మనోహర్ రెడ్డి, శాఖమూరి గోపాల్, ఇండియన్ వెటరన్ అధికారి
ఎం ఆర్ రెడ్డి మాట్లాడుతూ మా అసోసియేషన్ ఆధ్వర్యంలో పలుమార్లు మాజీ సైనికులకు ప్రత్యేక దర్శనంతోపాటు సదుపాయాలు కల్పించాలని విన్నవించడం జరిగిందన్నారు. రాష్ట్ర కమిటీ నేతలు వచ్చి మాజీ సైనికుల తరఫున వినతి పత్రం అందజేయడం జరిగిందని వాటిని పరిగణలోకి తీసుకొని ఈవో పెద్ద మనసు చేసుకొని శ్రీవారి దర్శనం వసతి సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సైనికులు అయిన మేము నిరంతరం నిస్వార్థంగా కృషి చేస్తూ సొంత ఖర్చులతో వందలాది కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ మాజీ సైనికుల సంక్షేమమే లక్ష్యంగా యూనియన్ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నామన్నారు. ఈవో ను కలిసిన వారిలో లక్ష్మయ్య, రవీంద్రబాబు, చిత్తూరు జిల్లా అసోసియేషన్ నేత త్యాగరాజు, వరదరాజులు పుంగనూరు నేత సుబ్రమణ్యం పెనుమూరు నేత ఆనంద నాయుడు, రాజేందర్ రెడ్డి, తిరుపతి నేత రామచంద్ర రాజు బాపట్ల అసోసియేషన్ నాయకులు బాలశివారెడ్డి బాపట్ల నాయకులు వెంకటకృష్ణారావు వీరస్వామి వెంకటరమణ 28 జిల్లాల నుండి మాజీ సైనిక సంఘం నేతలు ఉన్నారు.