GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 9:50 pm Posted by : GURU SWAMY

చెరకు రైతులకు తీపి శుభవార్త

కార్వేటినగరం జూలై 23 గరుడదాద్రి న్యూస్
రాబోయే 20 26 – 27 క్రషింగ్ సీజన్ కోసం చెరకు సరఫరా చేసే రైతులకు ఎస్ ఎన్ జె షుగర్ ఫ్యాక్టరీ వారు టన్నుకు రూ 3500 సంక్రాంతి వరకు చెల్లించనున్నట్లు ఎస్ ఎన్ జే ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుకు తీపి కబురు తెలిపింది. అదేవిధంగా 100% ఉచిత రవాణా సరఫరా చేస్తుందన్నారు. సంక్రాంతి తర్వాత అదనంగా టన్నుకు రూ 3600, మార్చి నుండి తన్నుకు 3700 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని చెరకు రైతులు సద్వినియోగం చేసుకొని ఫ్యాక్టరీకి పెద్ద మొత్తంలో చెరకును సరఫరా చేయాలని రైతులను కోరారు.