దువ్వూరులో ఘనంగా ఆర్యవైశ్య మహిళా సంఘం సమావేశం -నూతన కమిటీ నియామకాలు
గరుడ ధాత్రి న్యూస్ దువ్వూరు జూలై 24 కడప జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి రాజా వెంకట వరలక్ష్మి గారు దువ్వూరులో నిర్వహించిన మహిళా మండలి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సమావేశానికి ముందు చిలంకూరు వీర వెంకట స్వామి గారు జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు, కమిటీ సభ్యులకు ఆలయ విశిష్టతలను వివరించారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం, పూజలు నిర్వహించి, రాజా వెంకట వరలక్ష్మి...