తడలో చారిత్రాత్మక కోనేరు కాలుష్యానికి గురి.. దుర్వాసనతో ప్రజల తీవ్ర ఇబ్బందులు

తడ జూలై 22 గరుడధాత్రి : తడ పట్టణంలోని మసీదు సమీపంలో ఉన్న చారిత్రాత్మక కోనేరు తీవ్ర కాలుష్యానికి గురై దుర్వాసన వెదజల్లుతోంది. కోనేరులో చేపలు, చికెన్ వ్యర్థాలు, ఇతర చెత్తను నిర్లక్ష్యంగా పడవేయడంతో పాటు, పరిసర ప్రాంతాల ఇళ్ల నుంచి డ్రైనేజీ నీటిని నేరుగా కోనేరులోకి వదిలేస్తుండటంతో నీరు పూర్తిగా కలుషితమైంది. దీంతో కోనేరు పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు భరించలేని దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలు, ఈగలు అధికంగా పెరగడంతో డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని స్థానికులు...