గంగవరం సచివాలయంలో ‘డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్’ తనిఖీ

పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) : గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గంగవరం సచివాలయంలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి విచ్చేసిన 'డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్' బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా సచివాలయ పరిధిలోని గర్భవతులు, చిన్నపిల్లలకు అందుతున్న వైద్య సేవల వివరాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన అధికారులు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. వైద్యారోగ్య శాఖ ద్వారా అందించే ప్రతి సేవను...