శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం ప్రారంభం

తిరుపతి/ గరుడ ధాత్రి/ జూలై 24 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఆషాఢ మాసంలో శ్రీ గోవిందరాజస్వామివారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారికి నిత్యకైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి శతకలశ స్నపనం, మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా చేపట్టారు. అనంతరం ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం ఘనంగా...