కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ కార్యవర్గ ప్రమాణ స్వీకారం త్వరలో – జిల్లా అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ
బద్వేల్/మైదుకూరు జూలై 19 (గరుడధాద్రి న్యూస్): కడప జిల్లా ఆర్యవైశ్య సంఘం రూరల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని త్వరలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వల్లంకొండు వెంకటరమణ తెలిపారు. ఆదివారం బద్వేల్ పట్టణంలోని ఎన్జీవో హోం కార్యాలయంలో జిల్లా సంఘం తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులతో విస్తృతంగా చర్చించారు. అనంతరం జిల్లా కార్యవర్గంలోని వివిధ హోదాలకు నియమితులైన సభ్యులకు నియామక పత్రాలను...