– సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
– ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఘనంగా సత్కరించిన టీడీపీ పార్టీ నాయకులు
నారాయణవనం జూలై 19 ( గరుడ ధాత్రి న్యూస్ ):
ప్రభుత్వ సహకారంతో ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కైలాసనాధకోనను అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పేర్కొన్నారు.నారాయణవనం మండలం,అరణ్యం కండ్రిగ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఆదివారం సాయంత్రం సత్య వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను కలిసి తమ మద్దతును తెలిపారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడుతూ త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో మీ మద్దతుతో అరణ్యకండ్రిగ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేస్తామని హామీ ఇచ్చారు.అంతకుముందు గ్రామంలో వీధి దీపాలు సిమెంట్ రోడ్లు స్మశానానికి దారి వంటి పలుసమస్యలను ఎమ్మెల్యే దృష్టికి మహిళలు తీసుకురావడంతో స్థానిక పంచాయతీ కార్యదర్శి కి అలాగే ఎంపీడీవో కి ఫోన్ చేసి సమస్యలను పరిష్కరించే విధంగా వెంటనే పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు.అనంతరం ఎమ్మెల్యేను దుశ్శాలువ, పూలమాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కైలాసనాధ కోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ బత్తల భాస్కర్ యాదవ్, మాజీ సర్పంచ్ నర్రవుల ఉమా కంద స్వామి నాయుడు,మాజీ ఉపసర్పంచ్ మునస్వామి, తెలుగుదేశం పార్టీ నాయకులు విజయ్ చంద్ర నాయుడు, వెంకటేష్, ఏకాంబరం, సురేష్, మహిళలు పాల్గొన్నారు