GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 July 2026, 6:47 pm Digital Edition : GURU SWAMY

కైవారం శ్రీ సద్గురు యోగి నారాయణ సంగీతోత్సవాల గోడ పత్రిక ఆవిష్కరణ

పలమనేరు, జులై 20 ( గరుడ ధాత్రి ) :
గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని కైవారంలో నిర్వహించనున్న శ్రీ సద్గురు యోగి నారాయణ సంగీతోత్సవాల గోడ పత్రికను సోమవారం స్థానిక కృష్ణదేవరాయలు విగ్రహం వద్ద ఘనంగా ఆవిష్కరించారు. ఈ సంగీతోత్సవాలకు పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం ప్రతినిధులను ఆహ్వానించడానికి శ్రీ సద్గురు యోగి నారాయణ ట్రస్ట్ కమిటీ మెంబర్ ప్రభాకర్ విచ్చేసి సంఘ సభ్యులకు ఆహ్వాన పత్రికను అందజేసిన అనంతరం, సంగీతోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను సంఘ నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. గురుపూర్ణిమ వేడుకల్లో భాగంగా జరిగే శ్రీ సద్గురు యోగి నారాయణ సంగీతోత్సవాలకు అందరూ విశేష సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం సభ్యులు సుధాకర్, పీజేసీ బాబు, సోమశేఖర్, జనార్దన్, జయశంకర్, అరుణ్ కుమార్, సుదర్శన్ బాలాజీ, కోటేశ్వర్లు, రంగాకేఫ్ శివ, డిష్ రమేష్,లక్ష్మీపతి, పుష్పాలు వెంకటేశ్వర్లు, నరేష్, వెంకటరమణ, కేశవలు, భాస్కర్, మురళీ, హరి తదితరులు పాల్గొన్నారు.