గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కావాడి రవీంద్ర – గిరిజన హక్కుల సాధనకు కొత్త బాధ్యత

బి కొత్తకోట జూలై:21(గరుడ దాత్రి న్యూస్) భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కావాడి రవీంద్ర నియమితులవడం గిరిజన సమాజానికి ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు.పార్టీ పట్ల ఆయన చూపిన అంకితభావం, గిరిజన ప్రాంతాల్లో చేసిన సేవలు, సామాజిక సమస్యలపై తీసుకున్న చొరవను గుర్తించి పార్టీ అధిష్ఠానం ఈ కీలక బాధ్యతను అప్పగించినట్లు రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గిరిజనుల సంక్షేమం,విద్య, ఉపాధి,ఆరోగ్యం,భూ హక్కులు, అటవీ హక్కులు వంటి కీలక అంశాలపై మరింత సమర్థంగా పనిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు కావాడి రవీంద్రపై ఉంది.గిరిజన...