కోమన్నూతల అరటికి ప్రపంచ మార్కెట్లో మరింత గుర్తింపు తీసుకురావాలి..!

గరుడ దాత్రి న్యూస్ కడప, జూలై 22: కోమన్నూతల అరటి సాగు నాణ్యత, ఉత్పత్తి, మార్కెటింగ్ పరంగా దేశానికే కాకుండా ప్రపంచ స్థాయిలో ఆదర్శంగా నిలిచేలా రైతులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. పులివెందుల నియోజకవర్గ పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి లింగాల మండలం కోమన్నూతల గ్రామాన్ని సందర్శించి, అక్కడ విస్తారంగా సాగవుతున్న అరటి తోటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి పంట సాగు, దిగుబడులు, మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలు, ఎదురవుతున్న సవాళ్లపై సమగ్రంగా...