కుప్పం,జులై 20 (గరుడ ధాత్రి న్యూస్):
కుప్పం పురపాలక సంఘం కమిషనర్ వి శ్రీనివాసరావును స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించి, అభినందించారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా కమిషనర్ శ్రీనివాసరావు అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ క్లీన్స్వీప్ కార్యక్రమంలో రాష్ట్రస్థాయిలోనే వరదమ స్థానాన్ని కుప్పం పురపాలక సంఘం దక్కించుకోవడంతో కమిషనర్ అవార్డు అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు సోమవారం కార్యాలయంలో కమిషనర్ను కలిసి ఘనంగా సన్మానించి అభినందించారు. కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ సలహా మండలి సభ్యులు ఎస్ రాజ్ కుమార్, కుప్పం గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ చైర్మన్ ప్రతాప్ కుమార్, కుప్పం పురపాలక సంఘం ఫ్లోర్ లీడర్ దామోదరం నాయుడు, కౌన్సిలర్ సురేష్ తదితరులు కమిషనర్ను సన్మానించారు.